బిగ్ ట్వీస్ట్.. సీఎం రేసులో మూడో వ్యక్తి
కర్ణాటక ముఖ్యమంత్రి రేసులోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఇప్పటికీ సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో తెలియరాలేదు. అంతలోనే కాంగ్రెస్‌లో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి కావాలని పలువురు నిరసన తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సీఎంగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా ఎక్కువగా ఉందని.. ఖర్గే సీఎం కావాలని తాము కోరుకుంటున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న దళిత వర్గ నాయకులు తెలిపారు.

