Andhra PradeshHome Page Slider

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్

పులివెందుల టీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్‌ కుమార్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు.