Home Page SliderInternational

లాస్ ఏంజెల్స్‌కి బిగ్ రిలీఫ్

భయంకర కార్చిచ్చులతో అట్టుడుకిన లాస్ ఏంజెల్స్‌కు బిగ్ రిలీఫ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా అగ్ని జ్వాలలతో ఉక్కిరిబిక్కిరి అయిన అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తొలకరి జల్లులతో మంటలు చల్లారుతున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఖరీదైన హాలీవుడ్ ప్రాంతం బూడిద కాకుండా వర్షాలు ఆదుకున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల కొత్తగా మంటలు చెలరేగకుండా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఒక వేళ భారీ వర్షాలు పడితే కొండ ప్రాంతాలలో కాలిపోయినవన్నీ దిగువ ప్రాంతాలకు, ఇళ్ల సమూహాల వద్దకు బూడిద ప్రవాహంలా కొట్టుకు వస్తాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.