HealthHome Page SliderInternationalPoliticsviral

‘బైడెన్ భార్యదే తప్పు’..ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావడానికి బైడెన్ భార్య జిల్ బైడెన్‌దే తప్పంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. వైద్యురాలయి ఉండి తన భర్తలో క్యాన్సర్ లక్షణాలు ఎందుకు గమనించలేదని విమర్శించారు. జిల్ బైడెన్ నకిలీ వైద్యురాలని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. బైడెన్ ప్రొస్టేట్ స్కోరు 9 ఉండడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ స్కోరుకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలో వైద్యులు బైడెన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇది మనదేశానికి ప్రమాదకరమైన అంశం అని పేర్కొన్నారు. క్యాన్సర్ పరీక్షలు ఎందుకు ఆలస్యంగా చేయించారని విమర్శలు చేశారు.