భారత్‌పై బైడెన్ సర్కార్ కుట్ర!
భారత ఎన్నికలను ప్రభావితం చేసేలా అమెరికా మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కుట్ర పన్నారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు.ఎవరినో ( కాంగ్రెస్ పార్టీ?) ని అధికారంలోకి తెచ్చేందుకు అమెరికా మునుపటి బైడెన్ సర్కార్ శతధా ప్రయత్నించిందని ఇవాళ వెల్లడించారు.భారత లోక్ సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సినంత అవసరం అమెరికాకి ఏమొచ్చిందన్నారు.ఇదే విషయాన్ని ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కార్ కి కూడా ఆధారాలతో సమాచారం అందించామన్నారు. మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బైడెన్ సర్కార్ చాలా కుట్ర చేసిందని ట్రంప్ ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది.

