ట్రంప్‌కు బైడెన్, కమలా హారిస్ అభినందనలు
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభినందనలు తెలియజేశారు. కమలా హారిస్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు మనం కోరుకున్నది కాదని, ప్రజల తీర్పును గౌరవిస్తామని పేర్కొన్నారు. ఓటర్లు తనపై నమ్మకం ఉంచి, తనకు ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం అని, అధికార మార్పిడిలో ట్రంప్‌కు, అతని బృందానికి సహకరిస్తామని పేర్కొన్నారు. అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ కమలా హారిస్ అమెరికన్లకు ఛాంపియన్‌గా కొనసాగుతారని, ఆమె చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. త్వరలో ట్రంప్, అధ్యక్షుడు బైడెన్‌ను కలుస్తారని సమాచారం.