అదర గొట్టిన భువీ
ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. హోరా హోరిగా జరిగిన మ్యాచ్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లో అందరు వారివారి ప్రతిభ కనబరిచారు. హర్దిక్ పాండ్యా సిక్స్‌లతో మ్యాచ్‌ని ముందుకు తీసుకెళ్లారు. ఇక భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిచాడు. టీ20ల్లో పాకిస్థాన్‌పై అత్యంత వికెట్లు పడగొట్టిన అరుదైన ప్లేయర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఇంతకముందు ఈ రికార్డు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 6వికెట్లు ఉండగా , తాజాగా 9 వికెట్లు తీసి భువనేశ్వర్ కుమార్ మరో రికార్డుని సృష్టించాడు.

