భుజంగరావుకి రెండు కోర్టుల్లోనూ చుక్కెదురు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదర్కొంటున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకి రెండు కోర్టుల్లోనూ చుక్కెదురయ్యింది. గురువారం ఉదయం వాస్తవానికి నాంపల్లి కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా ఆయన తన మధ్యంతర బెయిన్ ని పొడిగించమని నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశాడు.అయితే నాంపల్లి కోర్టు ఆయన అభ్యర్ధనను తోసి పుచ్చింది.దీంతో వెంటనే ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.అయినా ప్రయోజనం లేకుండా పోయింది.భుజంగరావు ఐబిని తిరస్కరించింది.దీంతో గత్యంతరం లేక భుజంగరావు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.

