భుజంగరావుకి బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తికి బెయిల్ లభించింది.తెలంగాణ ఏఎస్పీ భుజంగరావుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రూ.లక్ష షూరిటీతో రెండు పూజీకత్తులు సమర్పించే విధంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా దేశం విడిచి వెళ్లకుండా పాస్ పోర్టు కూడా సమర్పించాలని ఆదేశించింది. కాగా ఇదే కేసులో గత మూడు రోజుల కిందట తిరుపతన్నకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన వారిలో ఇద్దరికి బెయిల్ లభించినట్లైంది.