Home Page SliderNational

యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోన్న భోళాశంకర్ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళాశంకర్ ట్రైలర్ నిన్న  విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ భోళాశంకర్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ..ట్రెండింగ్ నెం.1లో కొనసాగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు నిన్న ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా తమన్నా నటించగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా కన్పించనున్నారు. కాగా  హీరో సుశాంత్ కీర్తి సురేష్ భర్తగా నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విడుదలైన భోళాశంకర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న సాయంత్రం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు.