మా భట్టన్న ఇంతగా ఆవేశపడతాడనుకోలేదు…కేటీఆర్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టన్న ఇంతగా ఆవేశపడతాడనుకోలేదని వ్యాఖ్యానించారు బీఆర్‌ఎస్ ముఖ్య నేత కేటీఆర్. గవర్నర్ తమిళిసై ఉపన్యాసానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానంలో వాడివేడిగా అసెంబ్లీలో చర్చలు జరిగుతున్నాయి. కేటీఆర్, భట్టి విక్రమార్క మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలువైన సంపద ఆంధ్రనాయకుల పరం అవుతుంటే అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుల గొంతులు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. పదవుల కోసం, డబ్బుల కోసం ఆంధ్రనాయకుల మోజేతి కింది నీరు తాగేవారని,తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రనాయకులకు వంత పాడారని, నోళ్లు మూసుకుని ఊరుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఎప్పుడో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించిన ఇప్పుడెందుకన్నారు భట్టి విక్రమార్క , తెలంగాణ ఏర్పాటయినాకయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ఆవేశపడ్డారు భట్టి విక్రమార్క. విలువైన సంపద, మిగులు బడ్జెట్‌తో కూడిన తెలంగాణను బీఆర్‌ఎస్ చేతిలో పెడితే అప్పుల కుప్పగా తెలంగాణను పదేళ్లలో మార్చేశారన్నారు ఉపముఖ్యమంత్రి. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడిన మాటలు చదివి వినిపించారు కేటీఆర్. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు భట్టి ఇప్పుడు తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్నామని గుర్తు పెట్టుకోమన్నారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన విషయాలు మాట్లాడాలని భట్టి సూచించారు.