BusinessHome Page SliderNationalNews Alert

భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది

ఇంటర్నెట్ డెస్క్  కేంద్రప్రభుత్వ  సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ గవర్నెస్ డివిజన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారత్ ట్యాక్సీ త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. ఇకపై ఓలా, ఊబర్ వంటి సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగంలో రానున్నాయి. దీనివల్ల ఏ ఒక్క సంస్థకో లాభాలు పోకుండా డ్రైవర్లు లబ్ది పొందుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇది సహకార సంఘాల మాదిరే పని చేస్తుంది. దీనిలో టూవీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు కూడా నడుస్తాయి. ఇప్పటికే 650 మంది డ్రైవర్లు దీనిలో నమోదు చేసుకున్నారు. వీరితో పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో నవంబర్ లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది సహకార సంఘాల మాదిరిగా పని చేస్తుంది.

ఇటీవల ర్యాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై వినియోగదారుల నుండి విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లు కూడా తమ ఆదాయం నుండి కంపెనీలు కమీషన్ తీసుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ ట్యాక్సీలో డ్రైవర్లు ఎలాంటి కమిషన్ తీసుకోనక్కరలేదు. 2026 మార్చి నాటికి మెట్రో నగరాలలో ఈ యాప్ ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2030 నాటికి లక్షమంది డ్రైవర్లను దీనిలో భాగం చేయాలని ఆలోచిస్తోంది.