భద్రాద్రిలో గోదావరికి పోటెత్తిన వరద
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద వరదనీరు పోటెత్తింది. కొనసాగుతున్న సీతమ్మ బ్యారేజ్ పనులకు ఇది ఆటంకంగా మారింది. సాధారణంగా ఎండాకాలం కారణంగా గోదావరిలో నీరు అడుగంటి ఎడారిని తలపిస్తుంది. అలాంటిది ఈసారి వరద కారణంగా జలకళతో కళకళలాడుతోంది గోదావరి. అయితే సీతమ్మసాగర్ బ్యారేజ్ వద్ద కాపర్ డ్యాం తెగిపోవడంతో పనులు జరగడం లేదు. ఇప్పటికే నిర్వాసిత గ్రామాల అలజడులతో పనులు వెనుకబడ్డాయి. ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఒక ఎడతెగని వివాదంగా మారుతోంది. అమ్మగారి పల్లె వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు అసలు ఈ పాటికే పూర్తి కావలసి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మణుగు, దుమ్ముగూడెం,పర్ణశాల వంటి గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దీనితో వీరు తమ భూములు కోల్పోతామని, కేసు వేసారు అక్కడి ప్రజలు. దీనితో పనులు మందకొడిగా సాగుతున్నాయి.