HealthHome Page Slider

రాత్రిపూట అరటి పండు తింటే కలిగే ప్రయోజనాలెన్నో…

రాత్రిపూట అరటిపండు తినడం వల్ల అనేక లాభాలున్నాయి. రోజూ రాత్రి అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుంది. అరటి పండులో పొటాషియం ఉండటం వల్ల అది కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవారు రోజూ ఒకపూట భోజనం, లేదా టిఫిన్ మానేసి మూడు అరటి పళ్లు తింటే మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే జబ్బుపడిన వారు అరటి పళ్లు తింటే త్వరగా కోలుకునే అవకాశం ఉంది.