Andhra Pradesh

బెజవాడ దుర్గమ్మ నవరాత్రి అలంకారాలు

విజయవాడ దుర్గమ్మ గుడిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మొదటి రోజైన ఈరోజు (సెప్టెంబరు 26) శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. దుర్గమ్మ భక్తుల కన్నులపండుగగా ప్రతీరోజూ ఒక్కో అలంకారంలో దర్శనమివ్వనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బెజవాడ దుర్గమ్మ అలంకారాలు

సెప్టెంబరు 26- శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి

సెప్టెంబరు 27- శ్రీ బాలాత్రిపురసుందరీదేవి

సెప్టెంబరు 28- శ్రీ గాయత్రీదేవి

సెప్టెంబరు 29-శ్రీ అన్నపూర్ణాదేవి

సెప్టెంబరు 30-శ్రీ లలితా త్రిపురసుందరీదేవి

అక్టోబరు 1 -శ్రీ మహాలక్ష్మీదేవి

అక్టోబరు 2- శ్రీ సరస్వతీదేవి

అక్టోబరు 3- శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 4- శ్రీ మహిషాసురమర్దనీదేవి

అక్టోబరు 5 – శ్రీ రాజరాజేశ్వరీదేవి