అన్నపూర్ణమ్మగా బెజవాడ దుర్గమ్మ..పోటెత్తిన భక్తులు
దసరా నవరాత్రి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ‘భవతి భిక్షాం దేహి’ అంటే చాలు అపార కరుణను చూపించే ఆ తల్లి దయను పొందడానికి, భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. మూడవరోజైన తదియ నాడు అమ్మవారు అక్షయపాత్ర ధరించి సకల సృష్టికి ఆకలి తీరుస్తోంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, వాక్శుద్ది కలుగుతాయని నమ్మకం. సాక్షాత్తూ కాశీలో పరమేశ్వరునికే భిక్షను ప్రసాదించిన మాత కాశీ అన్నపూర్ణ. అందుకే సకల చరాచర జగత్తును ఆమె పోషించగలదు.

