ఈ ప్రాంతాలలో తిరిగేటప్పుడు జాగ్రత్త..
తెలంగాణలో మార్చి మధ్యలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు భగభగలాడుతూ కొన్ని ప్రాంతాలను చెమటలు పట్టిస్తున్నాడు. రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల ప్రజలు వడదెబ్బల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, కొమరంభీమ్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఎండ తీవ్రత అధికంగా 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని హెచ్చరించింది.