‘దైర్యంగా ఉండు లిటిల్ వారియర్’..ఎన్టీఆర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని.. దైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు వైద్య పరీక్షలు చేస్తున్నారని, చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారని సమాచారం. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన శ్రీ పవన్ కల్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్‌ను చూశారు. అని జనసేన పార్టీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.


