బీ అలర్ట్.. నకిలీ 500 నోట్లతో జాగ్రత్త..
మార్కెట్లో నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ అనే చోట ‘E’ అక్షరం బదులు ‘A’ ముద్రించారని పేర్కొంది. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప రూ.500 నోటు పై ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. ఈ విషయంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అప్రమత్తం చేశామని తెలిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఈ విషయంలో ప్రజలు కూడా ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. అలర్ట్ గా ఉండాలని సూచించింది.