Home Page SliderTelangana

బర్రెలక్క.. చదివింది పంచగామలోనే..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కర్నె శిరీష (బర్రెలక్క) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామలోని శివకేశవ వ్యవసాయ కళాశాలలో చదవడం గమనార్హం. 2013-14 ఎకడమిక్ ఇయర్‌లో ప్రవేశం పొందగా రెండేళ్లు చదివి ఉత్తీర్ణత సాధించారు. సామాజిక మాధ్యమాల్లో బర్రెలక్కగా వివిధ వీడియోలు పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ నయీంను ఆరా తీయగా.. ఆర్థికంగా బాగాలేక ఇంతదూరం వచ్చానని అప్పట్లో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.