NationalNews Alert

కిషన్ రెడ్డితో బంగ్లా ప్రధాని

భారత్‌ నాలుగు రోజుల పర్యాటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసినా బీజీ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా  నిన్న ప్రధాని మోదీతోనూ , అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన అదానీతో భేటీ అయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలలో వాణిజ్యం , సాంస్కృతిక సంబంధాలు , పర్యటకం అనే అంశాలపై ఇరువురు చర్చించారు.