‘బందిపోట్ల రాష్ట్ర సమితికి దోపిడీ మిషన్ మీది’- కేసీఆర్‌పై షర్మిల వ్యంగ్యాస్త్రాలు
తెలంగాణా సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘తెలంగాణా కల్వకుంట్ల వారి భోగమా ‘అని నిలదీసారు. అమరవీరుల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణా వీళ్ల అబ్బ సొమ్మా అని విమర్శించారు. వీళ్లు పుట్టకపోతే తెలంగాణా వచ్చుండేది కాదట అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణా తెచ్చిన దొర ఈయనేననట. వీళ్లు దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాదంట అంటూ ట్విటర్‌లో మండిపడ్డారు. దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలు ఆడితేనో తెలంగాణ రాలే! మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ.సకల జనులు వారి జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ అని విమర్శించారు.

