Andhra PradeshHome Page Slider

ఏపీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నీచర్ కొనుగోళ్లపై నిషేదం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఇకపై ఓ ఏడాదిపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నీచర్ కొనుగోళ్లపై సర్కార్ నిషేదం విధించింది. కాగా ప్రభుత్వ కార్యాలయాలు,సచివాలయాలు,HOD ఆఫీసుల్లో ఫర్నీచర్ కొనుగోళ్లను ప్రభుత్వం నిషేదించింది.  ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వ స్కూళ్లు,కాలేజీలకు వీటి నుంచి మినహాయింపు కల్పించింది.కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నీచర్ కొనుగోళ్లపై నిషేదం విధించడం ద్వారా ఖర్చులు తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.