బాలయ్య భలే భలే చెప్పాడుగా… జగన్ పజ్బీ గేమ్…!
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, లోకేష్ మామ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడు లోకేష్ పాదయాత్రలో మెరిసిన బాలయ్య వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్‌కు పబ్జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదన్న బాలయ్య, రాష్ట్రంలో మరోసారి జగన్ సర్కారు వస్తే.. ప్రజలు మరోచోటకి వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. వైసీపీ నుంచి చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారన్న ఆయన, వారందరూ టీడీపీలోకి వచ్చి ప్రజాసేవ చేద్దామనుకుంటున్నారని సెలవిచ్చారు. జగన్ ఏపీ సీఎం అయ్యాక అభివృద్ధి ఆగిపోయిందని, పరిశ్రమలు రాకపోవడంతో, ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు. ల్యాండ్, శాండ్ మాఫియా రాజ్యమేలుతుందన్నారు. పేదోళ్లు ఏపీలో బతికే పరిస్థితి లేకుండా చేశారన్న బాలయ్య, ప్రశ్నించినవారిపై కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ అరచాకలను ఎదిరిస్తే… త్వరలో టీడీపీ పాలన వస్తోందని జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా శింగనమలలో లోకేష్‌తోపాటు పాదయాత్రలో కొద్దిసేపు బాలకృష్ణ నడిచారు.

