మ్యూజిక్ డైరక్టర్‌కు బాలయ్య రూ.2 కోట్ల కారు గిఫ్ట్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ మ్యూజిక్ డైరక్టర్ తమన్‌ను భారీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువ గల పోర్షా కయెన్ కారును ప్రేమతో బహుకరించారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తమన్ తనకు తమ్ముడితో సమానమని బాలయ్య వ్యాఖ్యానించారు. సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ చిత్రం ‘డాకూ మహరాజ్’ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. గతంలో కూడా బాలకృష్ణ చిత్రాలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలకు తమన్ మ్యూజిక్ డైరక్టర్‌గా పని చేశారు. దీనితో బాలయ్య రాబోయే చిత్రాలలో కూడా తమనే మ్యూజిక్ డైరక్టర్‌గా పనిచేస్తారని సమాచారం.