రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ ఈసారి వేలంలో రికార్డు ధర పలికింది. లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా తుర్కయంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షల ధరకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో గురువారం వేలం దారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 36 మంది సభ్యులు ఉండగా ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు లడ్డూపై క్లెయిమ్ కోసం తీవ్ర వాగ్వాదానికి దిగారు. లడ్డూ వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, కొండపల్లి గణేష్, దశరత్ గౌడ్ ల మధ్య పోటీ ఏర్పడగా చివరకు డాక్టర్ దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుడు దయానంద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. “గత సంవత్సరం రెండవ స్థానంలో ఉన్నాను. ఈసారి గణేష్ మహారాజ్ ఆశీర్వాదంతో నేను లడ్డూను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను” అని దయానంద్ రెడ్డి చెప్పారు. స్వామి లడ్డూను తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు.
