చంద్రబాబు గెస్టుగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో
బాలయ్యబాబు వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతగా సూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఆహా ఓటీటీలో ప్రసారమైన ఈ షో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. బాలకృష్ణకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. మొదటి సీజన్ పూర్తయిన ఈ కార్యక్రమం ఇప్పుడు సీజన్-2 లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రారంభం కాబోతోంది. ఈ అన్ స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ అక్టోబరు 14న టెలికాస్టు కాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ TWO LEGENDS.. వన్ సెన్సేషనల్ ఎపిసోడ్ అంటూ ఆహా టీవీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ బావ అయిన చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడిగారా అనే ఆసక్తితో నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. మొదటి సీజన్‌లో మహేశ్ బాబు, అల్లుఅర్జున్, రాజమౌళి, కీరవాణి, తమన్, మోహన్‌బాబు, రవితేజ, రాణా, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ మొదలైన సెలబ్రెటీస్ పాల్గొని వారి విశేషాలు తెలియజేశారు.

