వెంకటేష్ మూవీ సెట్స్‌లో సడన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ
రామోజీ ఫిలిం సిటీ వేదికగా అనిల్ రావిపూడి – వెంకటేష్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య వచ్చి సందడి చేశాడు. బాలకృష్ణ, వెంకటేష్‌లు ఒకే చోట మీట్ అయ్యారు. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన సంగతి మీకు తెలిసిందే. వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు సక్సెస్‌ను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రాబోతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇప్పటికే తెలంగాణ మహిళా యూనివర్సిటీలో ఉన్న దర్బార్ హాల్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సెట్స్‌లో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అనంతరం వెంకటేష్, అనిల్ రావిపూడితో కలిసి ముచ్చటించారు బాలయ్య. ఇక బాలయ్య సెట్స్‌కి వచ్చిన ఫొటోలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.