హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హిందూపురం ఎన్నిక హారాహోరీగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, భార్య వసుందరతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిందూపురం అసెంబ్లీ ఎన్నికలో వైసీపీ నుంచి దీపిక రాణి పోటీ చేస్తుండగా, ప్రముఖ్య ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.


