వివేకా హత్య కేసులో కీలక వ్యక్తికి బెయిల్..
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తికి బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ వాదన ప్రకారం అతడు సాక్షులను ప్రభావితం చేస్తాడని, బెదిరింపులకు పాల్పడవచ్చని పేర్కొంది. కానీ అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. ప్రతీసారి విచారణకు హాజరు కావాలని, ప్రతీవారం పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగులో ఉంది.