Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

ర‌క్త‌చ‌రిత్ర నిందితుల‌కు బెయిల్‌

పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూర‌య్యింది. కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నలుగురు నిందితులు విడుద‌ల‌య్యారు. జైలు నుంచి విడుదలైన నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, రంగనాయకులు, ఒడ్డే కొండా లు రిలీజ్ కాగా…. విశాఖ జైలు నుంచి రేఖమయ్య విడుద‌ల‌య్యారు. పరిటాల రవి హత్య కేసులో మొత్తం 12 మందికి శిక్ష ప‌డ‌గా , వీరిలో ఇప్పటికే నలుగురు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.గ‌త ఆరు నెలల క్రితం మ‌రో ముగ్గురు బెయిల్ పై విడుద‌ల‌య్యారు.ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌లో మ‌ళ్లీ ఎలాంటి అల‌జ‌డులు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.