టీకా వికటించి శిశువు మృతి
టీకా వికటించడంతో నవజాత శిశువు మరణించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో జరిగింది. నేరెళ్ళ గ్రామానికి చెందిన లలిత, రమేష్ దంపతుల 45 రోజుల వయసుగల కూతురుకు నేరెళ్ళ పీహెచ్సీలో బుధవారం టీకా వేయించారు.అయితే ఇంటికి వెళ్ళాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు .దీంతో పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.కాలం చెల్లించిన ఇంజక్షన్లు ఇచ్చి తమ బిడ్డ ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

