బీ.ఆర్.ఎస్.కు హైకోర్టులో ఊరట
ఈ నెల 28న జిల్లా కేంద్రమైన నల్గొండలో బీ.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాదీక్షకు హైకోర్టు ఎట్టకేలకు అనుతిచ్చింది.షరతులతో కూడిన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ దీక్షను ఎలాంటి ఆందోళనలు లేకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.నల్గొండ పోలీసులు ఈ దీక్షకు తొలుత అనుమతి నిరాకరించడంతో బీ.ఆర్.ఎస్ హైకోర్టుని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు తీర్పునిచ్చింది.

