Andhra PradeshHome Page Slider

అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందే -సీబీఐ

ఎంపీ అవినాశ్ రెడ్డిపై వివేకా హత్య కేసులో వచ్చిన ఆభియోగాలపై ఆయనను అరెస్టు చేసి కస్టడీలో  విచారించవలసిందే అని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి తెలంగాణా హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసారు. ముందస్తు బెయిల్ ఇచ్చి దర్యాప్తుకు అడ్డుపడలేమని, సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో హైకోర్టు ఈ విషయాన్ని వాయిదా వేసింది. ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసి, కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, ఆయన దురుద్దేశపూర్వకంగా సమాధానాలు దాటవేస్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని పేర్కొంది. దర్యాప్తు నుండి తప్పించుకునే ఉద్దేశ్యంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని ఆ కౌంటర్‌లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు.