నేడు అవతార్-2 రిలీజ్… కళ్లు చెదిరే విజువల్స్ అంటూ వర్మ ట్వీట్
హాలీవుడు ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్-2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం 7 గంటల నుంచే అవతార్-2 సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్‌గా నిండాయి. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చూసి తనదైన శైలిలో సినిమా గురించి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. “ఇప్పుడే అవతార్-2లో స్నానం చేశాను.. దీన్ని ఒక సినిమా అనడం నేరం… ఎందుకంటే ఇది అంతకుమించి ఎక్కువ… ఇదొక జీవితకాలపు అనుభూతి. కళ్లు చెదిరే దృశ్యాలు, మతిపోయే యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే… చాలాసార్లు ఓ థీమ్ పార్క్‌లో ఉన్నామా అనిపిస్తోంది” అని సినిమా గురించి చెప్పుకొచ్చారు వర్మ.