నీ బాబు ఇస్తాడా పెట్రోల్..? అంటూ యువతిపై దాడి..
బెంగళూరు సీటీలోని ఓ యువతి ..తన ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఓలా యాప్ సహాయంతో ఆమె ఆటో బుక్ చేసింది. 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆటో.. లొకేషన్ కు చేరుకోవటానికి 15 నిమిషాలు చూపిస్తుంది. అయితే.. వారికి వెళ్లడానికి ఆలస్యమవుతుందని.. దీంతో వారు మరో విధంగా ఆలోచించి వారి దగ్గర ఉన్న వేరే ఫోన్ ద్వారా మరో ఆటోని బుక్ చేశారు. పీక్ అవర్స్ కావటంతో ఓలా ఆటోలు బుక్ కాలేదు. ఏ ఆటో ముందు వస్తే.. ఆ ఆటోలో వెళ్లాలని వారి ఉద్దేశ్యం. ఇలా ఒకేసారి రెండు ఆటోలు బుక్ చేసుకుని వారి స్పాట్ కి చేరడంతో ఇదే వివాదానికి దారి తీస్తుందోనని అసలు ఆలోచించుకోలేదు. దీంతో వారు ఏ ఆటోలు వెళ్లాలో అర్థం కాక డైలామాలో పడిపోయారు. ఓ ఆటోని క్యాన్సిల్ చేసి.. మరో ఆటోలో వెళ్లడానికి ప్రయత్నించారు. క్యాన్సిల్ చేసిన ఆటో డ్రైవర్ కి తీవ్ర కోపం వచ్చింది. రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశావ్..? పెట్రోల్ ఊరికే వస్తుందా..? నీ బాబు ఇస్తాడా పెట్రోల్..? అంటూ తీవ్ర ఆక్రోశంతో ఆ యువతిని చెంప దెబ్బ కొట్టాడు. రోడ్డుపై జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తున్న మిగతా ఆటో డ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకుని ఆటో డ్రైవర్ ను కూల్ చేసి అక్కడి నుండి పంపించారు.
ఈ వ్యవహారమంతా ఆ యువతి తన ఫోన్ ద్వారా వీడియో తీసి ఆమె X అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండించింది. నిందితుడైన డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణికుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అయితే.. ఈ ఘటనపై నెటిజన్లు సైతం ఇప్పుడు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఆటోవాలాను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ మహిళను సపోర్ట్ చేస్తున్నారు.