Breaking NewscrimeHome Page SliderNational

గ‌ర్భిణీపై సైకో లైంగిక దాడికి య‌త్నం

త‌మిళ‌నాడులోని కేవీ కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది.పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఓ సైకో గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు.అనంత‌రం కదులుతున్న ట్రైన్ నుంచి స‌ద‌రు మ‌హిళ‌ను తోసేశాడు. కోయంబత్తూరు, తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన జ‌రిగింది. బాత్రూమ్కి వెళ్లిన సమయంలో గర్భిణిపై సైకో లైంగిక దాడికి య‌త్నించాడు.మ‌హిళ బాత్రూమ్‌లో కేక‌లు పెడుతున్నా…విడ‌వ‌కుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడుని ప‌లు కేసుల్లో ఉన్న క్రిమిన‌ల్‌ హేమరాజ్ గా గుర్తించారు. మహిళ కేకలేస్తుండటంతో కదులుతున్న రైలు నుంచి తోసేశాడు.గర్భిణి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు మ‌హిళ‌ను కాపాడి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.బాధితురాలిని చిత్తూరుకు చెందిన మహిళగా గుర్తించారు.కాట్పాడి రైల్వే పోలీసుల నిందితుడు హేమ‌రాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు.