crimeHome Page SliderNational

సైఫ్‌ఖాన్‌పై దాడి.. కీలక విషయాల వెల్లడి

సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటనలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. ఇతడు సైఫ్‌పై దాడి చేసిన అనంతరం అక్కడ నుండి పారిపోయి బాంద్రా ప్రాతంలోనే బస్ స్టాప్‌లో పడుకున్నట్లు గుర్తించారు. అనంతరం రైల్ ఎక్కి వర్లీకి చేరుకున్నాడు. సైఫ్ ఉంటున్న 12వ అంతస్తులోకి అతడు పైప్ పట్టుకుని ఎక్కి, స్నానాలగది కిటికీ గుండా ఇంట్లోకి చేరుకున్నాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ ఉంటున్న గదిలోకి వెళ్లగా, కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. దీనితో సైఫ్‌కు, నిందితుడికి మధ్య జరిగిన పెనుగులాటలో సైఫ్‌కు ఆరుచోట్ల కత్తి గాయాలు అయ్యాయి. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని, వచ్చాక తన పేరు విజయ్ దాస్‌గా మార్చుకున్నాడని పేర్కొన్నారు. అతడిపై హత్యాయత్నంతో దోపిడీ, పాస్‌పోర్ట్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.

BREAKING NEWS: నీరజ్ చోప్రా వివాహం..భార్య కూడా..