మద్యం మత్తులో పోలీసులపై దాడి
మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్ లో పెట్రోలింగ్ పోలీసులపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనలో కానిస్టేబుల్ కార్తీక్, హోం గార్డు రాజు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని డీజే కార్తీక్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అశోక్, మోహన్ లుగా గుర్తించారు.


 
							 
							