కాంగ్రెస్ ఎంపీపై దాడి
అస్సాం కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దాడి జరిగింది. నాగావ్ జిల్లాలో హుస్సేన్, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారులపై ఒక గుంపు దాడి చేసింది. పార్టీ కార్యక్రమానికి స్కూటర్ పై వెళ్లే సమయంలో, ముసుగులు ధరించిన వ్యక్తులు బ్యాట్లతో దాడి చేశారు. ఈ దాడిలో హుస్సేన్ ఇద్దరు పీఎస్ఓలు స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో ఆ జిల్లాలో హుస్సేన్ ఉన్నంత వరకు ఆయన భద్రతను పెంచుతామని సీఎం హిమంత్ బిశ్వశర్మ తెలిపారు. అలాగే.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. ఈ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.