రాయదుర్గంలో దారుణం
దేశంలో క్రైమ్ రేటు రోజు రోజుకి పెరుగిపోతంది. ఇంటిలోని సమస్యలు , కుటుంబాల మధ్య ఆస్తి కలహాలు , అక్రమ సంబంధాలు వంటి కారణాలతో ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నారు. ఇటువంటి తరహా ఘటనే హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. 12 సంవత్సరాల దాంపత్య జీవితం పక్కన పెట్టేసి , కట్టుకున్న భర్తను హత్య చేయించింది రోజా రాగ్య. ప్రియుడితో కలిసి రూ.20 లక్షలు సుపారీ ఇచ్చిమరీ హత్య చేయించింది. తర్వాత భర్త మృతదేహాన్ని కృష్ణనదిలో పడేసింది. మృతుడు ధావరాత్ రాగ్యగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని మృతదేహం కోసం కృష్ణనదిలో గాలింపు చర్యలు చేపట్టారు.