దుండిగల్‌లో దారుణం..సీసీటీవి ఫూటేజ్‌లో రికార్డు
హైదరాబాద్ దుండిగల్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్ పార్కింగ్ నుండి బయటకు తీస్తున్న సమయంలో చూసుకోకుండా రెండేళ్ల బాలుడిపైకి డ్రైవర్ కారు ఎక్కించేసాడు. డ్రైవర్ బాలుడు అటుగా రావడం గుర్తించపోవడంతో ఈ దారుణం జరిగింది. దీనిని బాలుడి తల్లిదండ్రులు వెంటనే గమనించి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవిలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో వైరల్ అయ్యింది.
