దారుణ చర్య..24మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు దారుణ చర్యలకు పాల్పడుతున్నాయి. జషోర్ అనే జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శికి చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 24మంది సజీవ దహనం అయ్యారు. 21 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న కారణంగా వందలాది మంది మృతి చెందారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి, ప్రతిభకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ మొదలైన ఆందోళనలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. సైన్యం హింసాత్మక ఘటనలు జరగకుండా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ హింసాత్మక ఘటనలలో ఇప్పటి వరకూ 440 మంది చనిపోయినట్లు సమాచారం.

