ATM క్యాష్ లోడర్స్ రూ.1.25 కోట్లు చేతివాటం
టిజి: మంచిర్యాలలో ఇద్దరు ఏటీఎం క్యాష్ లోడర్స్ రూ.1.25 కోట్లు తస్కరించారు. ఏటీఎంలో నగదు జమచేసే సమయంలో మోహన్, పూర్ణచందర్ అనే క్యాష్ లోడర్స్ పలు దఫాలుగా డబ్బులు కాజేశారు. ఆడిటింగ్‌లో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. దీనిపై చర్యలకు అధికారులు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.