ఏ సమయంలో పెరుగు తింటే మంచిది ?
సాధారణంగా పెరుగు తింటే చాలా మంచిది అంటారు. కానీ, దానిని కూడా ఒక నిర్దిష్ట సమయంలోనే తినాలని చాలా మందికి తెలియదు. పెరుగును పగటి పూటనే తినాలని, రాత్రి సమయంలో తినకూడదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పగటిపూట పెరుగును తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని సూచించారు. రాత్రి పూట తింటే దాని తీపి లక్షణాల కారణంగా శరీరంలో కఫం, పిత్తం పెరుగుతాయి. ఆరోగ్యవంతులు తింటే కొంతవరకు పర్వాలేదు కానీ అలర్జీ, జలుబు, దగ్గు తో బాధపడేవారు రాత్రిపూట తినకూడదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఇందులోని కాల్షియం, ప్రోటీన్ ల వాళ్ళ కండరాలు బలంగా మారుతాయి. మరియు పగటిపూట పెరుగు తింటే సులభంగా జీర్ణం అవుతుంది.