భూమిని ..చంద్రుణ్ణి ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్
భూమిని ఢీకొట్టేందుకు ఓ గ్రహశకలం విశ్వంలో దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2032లో ఈ ముప్పు సంభవిస్తుందని కూడా సైంటిస్టులు వెల్లడించారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఆ గ్రహశకలం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిని కూడా ఢీ కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.130 నుంచి 300 అడుగుల వెడల్పుతో ఆ ఉల్క(గ్రహశకలం) ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఉల్క భూమి భూమిని ఢీకొనే అవకాశం 1.3 శాతంగా ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ, ఒక వారం తర్వాత మళ్లీ అంచానా వేసి… ఢీకొనే అవకాశం దాదాపు రెట్టింపు అయి 2.3 శాతానికి పెరిగిందని చెప్పారు. ఒక వేళ ఆ ఉల్క చంద్రుడిని ఢీ కొంటే.. హిరోషిమాపై పడిన అణుబాంబు విధ్వంసం గుర్తుందిగా, అలాంటి 340 అణుబాంబులు ఒకేసారి చంద్రుడిపై పడితే ఎలా ఉంటుందో అంతటి విధ్వంస ఉంటుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. అదే జరిగే ఆ దశ్యాలు భూమిపై నుంచి చూడొచ్చని కూడా చెబుతున్నారు.ఆ ఉల్క ప్రభావం కారణంగా చంద్రుని ఉపరితలంపై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక బిలం కూడా ఏర్పడుతుందని అంచనా వేశారు. అయితే ఈ ముప్పు కారణంగా భూమిపై జీవరాశి పూర్తిగా అంతం కాదు కానీ, చాలా ప్రాంతం మాత్రం విధ్వంసానికి గురి అవుతుంది. 2032 అంటే ఇంకా చాలా సమయం ఉంది కనుక.. ఆ ఉల్కను దారి మళ్లించే ప్రయత్నాలు నాసా చేస్తోంది. అలాగే చైనా వంటి దేశాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఒక గ్రహ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాయి.


 
							