ఏపీలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.అయితే ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కేబినెట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 3 రోజులపాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మొదటిగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేసే ప్రణాళికలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి ఏపీలో అన్నక్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

