ఎంపీలు, ఎమ్మెల్యేలకు రుణమాఫీ లేనట్లే!
టిజి: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10 వేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, టిజిఐఐసి భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా రూ.10 వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ.10 వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.