త్రీడీ ముద్రణతో కృత్రిమ రక్తనాళాలు
గుండె బైపాస్ శస్త్రచికిత్సలో వైద్యులు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. త్రీడీ ముద్రణ పద్దతిలో కృత్రిమ రక్తనాళాలను సృష్టించారు ఎడిన్‌బరో యూనివర్సిటీ పరిశోధకులు. ఇవి మనుషుల సిరలను పోలినట్లు ఉంటాయి. జిగురు ద్రవం గొట్టాల మాదిరిగా కనిపిస్తున్నాయి. దీనివల్ల వ్యక్తుల సమస్యలను బట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఈ రక్తనాళాలను తయారు చేసుకోవచ్చు. మృదువుగా, వంగే స్వభావం కలిగి, శరీరంలో తేలికగా ఇమిడిపోతాయి. 1 మి.మీ నుండి 40 మి.మీ మందం కలిగి ఉంటాయి. సాధారణంగా బైపాస్ సర్జరీలలో మచ్చలు, నొప్పి, ఇన్‌ఫెక్షన్ వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యలకు ఈ త్రీడీ రక్తనాళాలు మంచి పరిష్కారం. ఇవి శరీరంలో తేలికగా ఇమిడిపోవడం వల్ల దీర్ఘకాలం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.