రేపు చంద్రుని పైకి అర్టెమిస్ 1
నాసా మరో సారి చంద్రునిపై ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 3 న అర్టెమిస్ 1 ప్రయోగించనున్నట్టు సమాచారమిచ్చింది. ఇప్పటివరకు దీనిపై ఎన్నో పరీక్షలు చేసిన నాసా..దీని ద్వారా చంద్రుని పైకి వ్యోమగామ నౌకలను పంపే ప్రయత్నం చేస్తోందని సమాచారం. దీన్ని ఫ్లోరిడా టైమింగ్ ప్రకారం మధ్యహ్నం 2:17 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ సమాచారాన్ని ఫ్లోరిడాలో జరిగిన బ్రీఫింగ్లో , మిషన్ మేనేజర్ మైఖేల్ సరాఫిన్ మాట్లాడారు. శనివారం నాడు ఈ ప్రయోగాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలిపారు.

దీనికి వాతావరణం అనుకూలించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి 60 శాతం మాత్రమే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. తొలుత ఆగష్టు 29 దీనిని లాంచ్ చేయాలని భావించారు. కానీ కొన్ని సాంకేతిక లోపాల కారణంగా నాసా ఆ ప్రయత్నాన్ని నిలిపివేసింది. కాని ఇప్పడు అన్ని చెకింగ్లను పూర్తి చేసుకొని మరల చంద్రుని పైకి దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. .

